ప్రాణాపాయ స్థితిలో పసివాడి ప్రాణం.ఆపన్న హస్తం కోసం ఎదురు చూపు

ప్రాణాపాయ స్థితిలో పసివాడి ప్రాణం.ఆపన్న హస్తం కోసం ఎదురు చూపు
వరంగల్,అక్షిత బ్యూరో : బాలుడి కిడ్నీ పాడవడంతో వైద్య సహాయం కోసం తల్లిదండ్రులు వేడుకోలు…
ఈ చిత్రంలో కనిపిస్తున్న బాలుడి పేరు కౌశిక్ తేజ. వయస్సు 4 సంవత్సరాలు. చిరుప్రాయంలోనే చిన్నారికి పెద్ద సమస్యే వచ్చింది. ఇంట్లో ఆడుతూ పాడుతూ గడపాల్సిన సమయంలో మూత్ర పిండాలు కిడ్నీలు పాడైపోవడంతో కార్యాలయాలు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందిందని బాలుడి తల్లి పాగే శోభ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.వీరిది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం స్తంభంపల్లి గ్రామం.. పాగే శోభ ముత్తయ్య దంపతులకు ఇద్దరు కుమారులు చిన్న కుమారుడైన కౌశిక్ తేజ కు చిన్నప్పటి నుంచి ఆరోగ్య సమస్యలు తలెత్తాయని మా పరిస్థితి దుర్భరంగా ఉందని అన్నారు.బాలుడి ఆరోగ్య సమస్య గురించి శోభ చెబుతూ చిన్నప్పుడే పిల్లవాడికి కుడి మూత్ర పిండం కింద కణత తయారైందని దీంతో మూత్రం బయటకు వచ్చేది కాదని చికిత్స చేయించి కణతను తొలగించామని శస్త్రచికిత్సకు రూ.2.50 లక్షల ఖర్చయిందని అప్పు తెచ్చి మరీ వైద్యం చేయించామని మరోసారి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్తే ఎడమ కిడ్నీ పూర్తిగా కూడా చెడిపోయిందని కిడ్నీని పూర్తిగా తొలగించాలని వైద్యులు తెలిపారని చెప్పారు.కొత్త కిడ్నీ మార్పిడికి రూ.15 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారంటూ ఆవేదనను వ్యక్తం చేసింది.కూలీనాలీ పనిచేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న మాకు 15 లక్షల రూపాయల వ్యయంతో ఆపరేషన్ చేయించే స్తోమత లేదని దయతో ఎవరైనా దాతలు సాయం చేయగలరని శోభ ప్రాదేయ పడుతున్నారు. సాయం చేయదలిచిన వారు ఈ నంబర్లకు 7287954127,
8520847400 సంప్రదించవచ్చనీ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking