కుష్టి వ్యాధి నివారించడానికి అవగాహన పెంచుకుని సరైన మందులు వాడితే పూర్తిగా నయం

కుష్టి వ్యాధి నివారించడానికి అవగాహన పెంచుకుని సరైన మందులు వాడితే పూర్తిగా నయం

వరంగల్,అక్షిత బ్యూరో : జిల్లాలో నేడు పట్టణ ప్రాథమికవరంగల్ ఆరోగ్య కేంద్రము దేశాయిపేటలో జాతీయ కుష్టి వ్యాధి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది. ఈ సమావేశానికి స్థానిక వైద్యాధికారి డాక్టర్ భరత్ కుమార్ జిల్లా ఫిజియోథెరపిస్ట్ డా,నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. డాక్టర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ కుష్టి వ్యాధి సాధారణమైన జబ్బు దానిని గురించి ప్రజలు ఆందోళన చెందకుండా తగిన చికిత్స తీసుకున్నట్లయితే అన్ని వ్యాధులు లెక్క ఇది కూడా నయం అవుతుందని తెలిపినారు.

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కుష్టి వ్యాధి పై ప్రతి ఒక్కరు ఈ విధముగా ప్రతిజ్ఞ చేయాలని కోరినారు. నా కుటుంబంలో లేదా పొరుగువారిలో లేదా కమ్యూనిటీలో ఎవరికైనా చర్మంపై స్పర్శ కోల్పోయిన ఈ కుష్టి వ్యాధి అవగాహన ప్రచారము నేటి నుండి ఫిబ్రవరి 13వ తారీకు వరకు సమాజంలో ప్రజలంతా చర్చించుకుని అవగాహన కల్పించుకొని వ్యాధి నివారణకు సహకరిస్తారని కోరినారు . ఈ కార్యక్రమంలో కుష్టి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు పండ్ల పంపిణీ, దుప్పట్ల పంపిణీ, ఎంసిఆర్ చెప్పుల పంపిణీ ,అల్సర్ కిట్స్ ,బిస్కెట్స్ మొదలగునవి పంపిణీ చేసినారు.
ఈ కార్యక్రమంలో, డిపిఎమ్ఓ అనుపమ, సీఓ కొర్నిల్ ప్రాథమిక ఆరోగ్య వైద్య సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారుపాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking