ఎస్సారెస్పీ కెనాల్ కు మరమ్మత్తులు చేయించండి సిపిఎం
వరంగల్,అక్షిత బ్యూరో : హనుమకొండ పెద్దమ్మ గడ్డ మూడు నాలుగు మున్సిపల్ డివిజన్ లో ఎస్సారెస్పీ కెనాల్ నీరు రోడ్డుపై ప్రవహిస్తున్నందువలన రోడ్లు మరమ్మత్తులకే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రము అందజేశారు హనుమకొండ చౌరస్తా కు కూతవేటు దూరంలో పెద్దమ్మగడ్డ కాకతీయ కెనాల్ అవతల ములుగు రోడ్ నుంచి ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్ జ్యోతి బస్ నగర్ ఫేస్ టు కు వెళ్ళు రోడ్డు పై ఎస్సారెస్పీ కెనాల్ వాటర్ ప్రవహిస్తున్నందువలన రోడ్డు అంతా బురదమయం మరియు గుంతలు ఏర్పడి కనీసం నడవడానికి కూడా వీళ్లను పద్ధతిలో రోడ్డు మొత్తం బురదమయమైనది రాత్రి వేళలో కాలేజీలో కాలేజీ విద్యార్థులు కాలనీ వాసులకు గాని ఆస్పత్రికి వెళ్లాలంటే కనీసం అంబులెన్స్ కూడా రోడ్డు దాట లేని పరిస్థితి ఉంది

ప్రజా ప్రతినిధులు వస్తున్నారు గాని ఎవరు పట్టించుకోకపోవడం పద్ధతి కాదు అని విమర్శించారు.
ఇప్పటికైనా వెంటనే రోడ్డు నిర్మాణం,కెనాల్ వాటర్ కి పైప్లైన్ మరమ్మత్తు చేపట్టాలని లేనట్లయితే మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ధర్నా చేయవలసి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో హనుమకొండ నార్త్ కమిటీ కార్యదర్శి గాదె రమేష్ వెల్దండ భాస్కర్, క్రాంతి, స్వప్న, రజిత, మానస, అభిరామ్ రాజ్, రాజేష్, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.