గ్రామ సమస్యలు పరిష్కరించాలి
– కొవ్వూరు రంజిత్
నకిరేకల్ అక్షిత ప్రతినిధి: కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలో సమస్యలు తీర్చాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ కి ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం బిస్పి జిల్లా కోశాధికారి కొవ్వూరి రంజిత్ వినతిపత్రం అందజేశారు.గ్రామంలో వున్నా సమస్యలు పరిష్కారించాలని ఎన్ని సార్లు అధికారులకు, నాయకులు వినతిపత్రలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందన్నారు.గ్రామంలో డ్రైనేజీ,సిసి రోడ్డులు, రోడ్లు అక్రమణకు గురైయన్నారు. సంబంధిత అధికారులు, నాయకులు మీద చర్యలు తీసుకొని అభివృద్ధి చేయాలని కోరారు