కెనాల్ మరమ్మత్తు పనులను పరిశీలించిన ఎమ్మెల్యేలు

కెనాల్ మరమ్మత్తు పనులను పరిశీలించిన ఎమ్మెల్యేలు

మంచిర్యాల, అక్షిత బ్యూరో:-నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మాసాయిపేట్ గ్రామ సమీపంలో గల సధర్మాట్ కడెం ఫీడింగ్ కెనాల్ మరమ్మత్తుల పనులను సోమవారం ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు లు పరిశీలించారు. ఇరిగేషన్ ఎస్ఈ సుశీల్ కుమార్ తో మరమ్మత్తుల పనులు, కడెం ప్రాజెక్ట్ లోకి నీటి ఫీడింగ్ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వేగంగా పనులు పూర్తి చేసి రైతులకు సాగునీటి కష్టాలు లేకుండ చూడాలని సూచించారు.
రైతుల సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. ఇరిగేషన్ అధికారులు రైతులకు సహకరించి నీటి విడుదలలో జాప్యం చేయకుండ చూడాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, నిర్మల్ జిల్లాల నాయకులు ఇరిగేషన్ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking