తాండూర్ ఐబి చౌరస్తాలో మహాత్మా గాంధీకి ఘన నివాళి
మంచిర్యాల, అక్షిత బ్యూరో:- మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలొ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూరం దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఐబి చౌరస్తాలో 75వ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్బంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తదనంతరం దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, అహింస అనే అయుధంతో సూర్యుడస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి, భరతమాతకు దాస్యశృంఖలాల నుంచి విముక్తి కలిగించిన మహోన్నతుడు మహాత్మా గాంధీ అని అన్నారు. 20వ శతాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన నాయకుల్లో ముందు వరుసలో నిలిచిన జాతిపిత, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, కులమత బేధాలను పటాపంచలు చేశారని అన్నారు. సత్యాగ్రహం, అహింస పాటించడానికి ఎంతో ధైర్యం కావాలని నిరూపించిన సహనశీలి, భారత స్వాతంత్య్ర పోరాటాన్ని, గాంధీజీ జీవితాన్ని విడదీసి చూడలేమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కాపర్తి సుభాష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పుట్ట శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి షేక్ మొమిన్ అలీ, బీసీ సెల్ నాయకులు వడ్నాల మల్లేష్, సీనియర్ నాయకులు అర్షద్ ఖాన్, తోట శ్రీనివాస్, షేక్ అహ్మద్, జైన సాంబయ్య, మీర్ మోసిన్ అలీ, శంకరయ్య, కాసిం అలీ, కృష్ణ పెళ్లి లక్ష్మీనారాయణ, జెర్రీ గల రమేష్, అన్నదాసరి సత్యనారాయణ, పులి మధునయ్య , తోటపల్లి ఎల్లయ్య, రాజా రామ్ చందర్ కుమార్, పోగు తిరుపతి, స్వామి తదితరులు పాల్గొన్నారు.