కంటి వెలుగు దేశానికే ఆదర్శం

కంటి వెలుగు దేశానికే ఆదర్శం

కంటి వెలుగు కార్యక్రమాన్ని సందర్శించిన. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

పినపాక అక్షిత ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం లోని అనంతోగు గ్రామంలోని ఆశ్రమ పాఠశాల నందు కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు బి ఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అందత్వాన్ని నివారించేందుకు వెలుగు పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నదని ఆయన అన్నారు. కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకం మొదటి దశ విజయవంతమైనదని, వృద్ధుల కోసం కంటి వెలుగు సమస్యలు ఉన్న వారికి వారి జీవితాలలో వెలుగు నింపాలని ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం చేపట్టడం జరిగింది అన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇప్పటివరకు దేశంలో ఎక్కడా అమలు చేయడం లేదు అన్నారు. ముఖ్యంగా తెలంగాణలో అమలవుతున్న దళిత బంధు రైతు బంధు, రైతుబంధు, రైతు భీమా, మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, కెసిఆర్ కిట్టు, ఒంటరి మహిళ పెన్షన్లు వంటి పథకాలు దేశానికే ఆదర్శమని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking