ఎన్ఎస్ఎస్ అధ్వర్యంలో మహాత్మగాంధీ 75వ వర్ధంతి వేడుకలు

ఎన్ఎస్ఎస్ అధ్వర్యంలో మహాత్మగాంధీ 75వ వర్ధంతి వేడుకలు

మందమర్రి, అక్షిత ప్రతినిధి:– జాతిపిత  మహాత్మాగాంధీ 75వ వర్ధంతి వేడుకలను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ అధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఎం కృష్ణయ్య మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సత్యం, అహింస అనే మార్గాన్ని ఎంచుకుని బ్రిటిష్ పాలనలో బందిగా వున్న భారతదేశపు ఉక్కు సంకెళ్లను తొలగించిన మహానుభావుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. సత్యం అహింస స్వాతంత్ర్య పోరాటానికి ఆయుధాలుగా చేసుకొని బ్రిటిష్ ప్రభుత్వ సంకెళ్ళను తొలగించి భారత దేశానికి స్వాతంత్ర్యం అందించిన మహాత్మా గాంధీ జీవితం అందరికీ ఆదర్శం అని, ఆయన చూపిన బాటలో అందరూ నడవాలని అన్నారు. సమాజంలో ఇంత స్వేచ్చగా తిరుగుతున్నామంటే  ఎందరో ప్రాణ త్యాగాల ఫలమే అని తెలిపారు. తెల్ల దొరల బానిస సంకెళ్ల నుండి దేశ ప్రజలకు విముక్తిని కలిగించడంలో మహాత్మా గాంధీ ముందు నడిచారని అన్నారు. సహాయ నిరాకరణ, స్వదేశీ ఉద్యమం, విదేశీ వస్తు బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా వంటి కార్యక్రమాల్లో ప్రముఖ పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పిఓ సురేష్ అధ్యాపక బృందం ఉషారాణి, చంద్రకళ, భీమయ్య, రామయ్య, లక్ష్మీనారాయణ, మహేష్, సతీష్, లింగమూర్తి, వజీర్, శ్రీకాంత్, వేణు, రమేష్,  కోటేశ్వర్, ప్రభాకర్, దివ్యజ్యోతి, రవీందర్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking