కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. గాలి బాలాజీ.
కూకట్ పల్లి,అక్షిత,ప్రతినిధి: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని టిపిసిసి సభ్యులు గాలి బాలాజీ అన్నారు. భారత్ జోడో యాత్ర కాశ్మీర్ లో ముగియనున్న సందర్భంగా రాహుల్ గాంధీ కి సంఘీభావం గా ఎఐసిసి అదేశాల మేరకు కెపిహెచ్బి కాలనీ టెంపుల్ బస్సు స్టాప్ వద్ద కాంగ్రెస్స్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. కన్యాకుమారి నుండి కాశ్మిర్ వరకు సాగిన భారత్ జోడో యాత్రకు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ ను విద్వేషాలను వదులు అనే నినాదం తో సాగిన ఈ యాత్రకు దేశ వ్యాప్తంగా మద్దతు తెలిపిన అశేషా భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం
మహాత్మ గాంధీ 75 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలోచలం, కృష్ణారెడ్డి, ప్రవీణ్, ఫణి, అరవిందరెడ్డి, కరీం, వసీమ్, రాజేంద్ర, రాజు,శోభారాణి, వరలక్ష్మి, వనజ లు పాల్గొన్నారు.