అక్రమ వసూళ్లు ఆపాలి: కందగట్ల

అక్రమ వసూళ్లు ఆపాలి: కందగట్ల

భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి: అడ్వాన్స్ కన్జఫ్షన్ డిపాజిట్ పేరుతో అదనపు వసూల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలపై
పెను భారలు మోపడం ఆపకపోతే బషీర్బాగ్ విద్యుత్ పోరాటాన్ని చవిచూడాల్సి ఉంటుందని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కొత్తగూడెం సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి కందగట్ల సురేందర్ అన్నారు.
సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, కొత్తగూడెం సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సబ్ డివిజన్ కమిటీ నాయకులు మోతుకూరి మల్లికార్జున్ రావు అధ్యక్షతన కొత్తగూడెం విద్యుత్ శాఖ భజన మందిర్ డి ఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, విద్యుత్ శాఖ అధికారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ కొత్తగూడెం సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి కందగట్ల సురేందర్
ఈ ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ శాఖ వారు వినియోగదారులపై అడ్వాన్స్ కన్జఫ్షన్
డిపాజిట్ పేరుతో అక్రమంగా అదనపు వసూలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఎ.సి.డి పేరుతో పేద మధ్యతరగతి ప్రజలపై వేల రూపాయలు దండుకోవడం దుర్మార్గం అన్నారు. రైతాంగానికి 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి అమలు చేయడంలో కెసిఆర్ ప్రభుత్వం విఫలం అయిందన్నారు. వేంటనే వ్యవసాయ రంగానికి రైతాంగానికి ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇవ్వాలని అప్రకటిత కరెంట్ కోతలు ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యుత్ రంగంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఏ సి డి బిల్లులు ఉపసంహరించుకోకుంటే ప్రజలు మరో విద్యుత్ ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ కొత్తగూడెం సబ్ డివిజన్ కమిటీ నాయకులు బూరుగడ్డ వెంకటమ్మ , పెద్ద ఫ్రొలు చలమయ్య, ఈదునూరి సంజీవ్ రావు నాయకులు రాజు, సుధాకర్, పాషా, శంకర్, రాములు, వెంకటేశ్వర్లు, రవి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking