గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు గా ఘణపురం రవీందర్….
శేరిలింగంపల్లి అక్షిత ప్రతినిధి : శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన దళిత నాయకులు ఘనపురం రవీందర్ ను తెలంగాణ అంబేద్కర్ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు గా నియమించి నియామక
పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అంబేద్కర్ సంఘం తెలంగాణ రాష్ట అధ్యక్షులు పోతరాజు లాలయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ వెలమకంటి దయాకర్ లు మాట్లాడుతూ రవీందర్ అంకిత భావంతో చేసే పనితీరుని అభినందిస్తూ సంఘం, అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని అనుసరిస్తూ ఆదర్శవంతమైన సేవలు అందించి ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తి కలిగేలా పనిచేయాలని వారు అభిలషించారు. పర్నంది స్వామీ, మల్లెల జయా ఘనపురం రవీందర్ కీ అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఘనపురం రవీందర్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు, ఆలోచనా విధానాన్ని అనుసరిస్తూ వాటి సాధనకు కృషి చేస్తానని గ్రేట్ హైదరాబాద్ లో కమిటీలను ఏర్పాటు చేసి తెలంగాణ అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయడానికి నా వంతు కృషి చేస్తా , అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం, సామాజిక న్యాయం కోసం, ఆత్మగౌరవం అహర్నిశలు కృషి చేస్తానని ఆయన అన్నారు.