గిరిజన హాస్టల్ వర్కర్ల పెండింగ్ వేతనాలు, ఏరియర్స్ చెల్లించాలి. జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి. మంచిర్యాల ఎమ్మెల్యే కు వినతి పత్రం మంచిర్యాల, అక్షిత బ్యూరో:-
గిరిజన హాస్టల్ వర్కర్ల పెండింగ్ వేతనాలు, ఏరియర్స్ చెల్లించాలి.
జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి.
మంచిర్యాల ఎమ్మెల్యే కు వినతి పత్రం
మంచిర్యాల, అక్షిత బ్యూరో:- గిరిజన హాస్టల్ వర్కర్ల పెండింగ్ వేతనాలు, ఏరియర్స్, జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాల, హాస్టల్స్ అవుట్ సోర్సింగ్, డైలీ వైస్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ, ఫిబ్రవరి లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో జిల్లాలోని గిరిజన హాస్టల్ వర్కర్స్ అవుట్ సోర్సింగ్, డైలీ వైజ్ వర్కర్ల సమస్యలపై ప్రభుత్వంతో మాట్లాడి, సమస్యల పరిష్కారం చేయాలని కోరారు. గత 5 నెలలుగా వేతనాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని, పండుగ పూట కూడా పస్తులే ఉన్నారని అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులు, ఈ కుబేర్ లో ఫ్రిజ్ చేశారని, ప్రభుత్వం ఇప్పటికైనా పెండింగ్ వేతనాలు ఏరియర్స్ తో సహా చెల్లించాలని, తపాలా శాఖ ప్రవేశ పెట్టిన 10 రూ, లక్షల ఇన్సూరెన్స్ పాలసీని ఐటీడీఏ అధికారులు ప్రీమియం చేయించి, కార్మికులకు అమలు చేయాలని, దాంతో పాటు జివో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని, పీఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వర్కర్స్ యూనియన్ నాయకులు రాజన్న, అరుణ, వజ్రమ్మ, ప్రేమ్ కుమార్, మహేష్, రాజ్ కుమార్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.