సీఎం కేసీఆర్‌తో అమిత్‌జోగి భేటీ

సీఎం కేసీఆర్‌తో అమిత్‌జోగి భేటీ

హైదరాబాద్‌, అక్షిత ప్రతినిధి :

ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ జోగి తనయుడు, జనతా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ జోగి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ ముఖ్యనాయకులతో కలిసి బుధవారం ప్రగతి భవన్‌కు వచ్చిన అమిత్ జోగీ, సీఎం కేసీఆర్‌తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, దేశంలోని రాజకీయ పరిణామాలు, జాతీయ వ్యవహారాలపై చర్చించారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ విధి విధానాలను ఆసక్తితో అధినేత కేసీఆర్‌ను అడిగి తెలుసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల అవసరం ఉందని అమిత్ జోగి అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీని స్థాపించడాన్ని ఆహ్వానించారు. అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్ర పాలనను దేశానికి ఆదర్శంగా నిలిపారని, సంక్షేమం అభివృద్ధి రంగాల్లో దేశంలో ముందు వరసలో తెలంగాణను నిలిపేందుకు కృషి చేశారని సీఎంను అభినందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు అమిత్ జోగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన తండ్రి ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీ తన గురించి రాసుకున్న ఆటోబయోగ్రఫీని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు బహూకరించారు. కాగా, జనతా కాంగ్రెస్‌ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking