నేడు ధర్మారంలో కంటి వైద్య శిబిరం ప్రారంభం,ఎంపిడిఓ శ్రీనివాస్ గౌడ్

నేడు ధర్మారంలో కంటి వైద్య శిబిరం ప్రారంభం,ఎంపిడిఓ శ్రీనివాస్ గౌడ్

మద్దూరు అక్షిత న్యూస్: మండలంలోని ధర్మారం గ్రామంలో నేటి నుండి (సోమవారం) నాలుగు రోజుల పాటు కంటి వెలుగు వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపిడిఓ శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో విలేఖర్లకు తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మద్దూరు గ్రామంలో సోమవారంతో కంటి వెలుగు వైద్య శిబిరం ముగింపు సందర్బంగా ఆయన మాట్లాడుతూ ధర్మారంలో ప్రతి ఒక్కరు కంటి వెలుగులో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అదే విధంగా మండలంలోని వంగపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని ఎంపిడిఓ శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు.గ్రామంలోని ప్రతి ఒక్కరు వైద్య శిబిరంలొ పాల్గొనే విధంగా ఆశా అంగన్వాడి, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ఎంపిడిఓ కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగి భాగ్యలక్ష్మి శ్రీనివాస్, ఎంపిఓ ఖాజా మైనొద్ధిన్, ఏ పి ఎం అంబాల బిక్షపతి, ఆశా, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking