ఈనెల 10న ఖమ్మం జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ

ఈనెల 10 న ఖమ్మం జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ

-మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

ఈనెల 10 న ఖమ్మం జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.గత నెల 18న ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు నెల రోజుల వ్యవధిలో జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలను అందజేస్తామని బహిరంగ సభ వేదిక ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసింది. ముఖ్య మంత్రి ఇచ్చిన హామీ మేరకు ఈ బాధ్యతలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ అప్పగించగా హరీష్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ నిన్న హైదరాబాద్ నుంచి నేరుగా నూతన కలెక్టరేట్ కు చేరుకొని జిల్లా కలెక్టర్ ఇతర రెవెన్యూ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీ పై సమీక్ష నిర్వహించారు.ఇప్పటికే స్థలం గుర్తించడమైందని ప్రతి జర్నలిస్టుకి 200 గజాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో పనిచేసే జర్నలిస్టులకు, ఫోటోగ్రాఫర్లకు, టౌన్ రిపోర్టర్లకు, కెమెరామెన్ లకు అందరికీ ఇళ్లస్థలాలు పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కూడా అజయ్ కుమార్ తెలిపారు.ఈ నెల 10 న హరీష్ రావుకు అసెంబ్లీలో వైద్యం బడ్జెట్ పద్దు పై ప్రసంగించే అవకాశం ఉంటే ఆ రోజు ఖమ్మంకు రానిపక్షంలో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈనెల 13 గాని లేదా 14 తేదీల్లో గాని కేవలం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం హరీష్ రావు హైదరాబాద్ నుండి ఖమ్మం విచ్చేసి జర్నలిస్టుల పట్టాలు పంపింణి చేసి తిరిగి వెళ్తారని మంత్రి పువ్వాడ తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెలరోజుల వ్యవధిలో నే పట్టాల పంపిణీ పూర్తి చేసేందుకు సంసిద్ధులు అయినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కూడా అజయ్ కుమార్ కి జిల్లా కలెక్టర్ గౌతమ్ కి జిల్లా జర్నలిస్ట్ ల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ విపి. గౌతమ్ మేయర్ పునుకొల్లు నీరజ సుడా ఛైర్మన్ విజయ్ కుమార్ పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి ఎన్ మధుసుధన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking