లయన్స్ క్లబ్ సేవలు నిరూపమానం

లయన్స్ క్లబ్ సేవలు నిరూపమానం

నల్లమోతు సిద్దార్ధ 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ సేవలు నిరూపమానమైనవి అని యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ కొనియాడారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ వారు 100 రోజుల పాటు మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 100 రోజుల పాటు అన్నార్తులకు, ప్రభుత్వ ఆస్పత్రికి వైద్య సేవల కోసం వచ్చే రోగులకు, అటెండెంట్స్ కు అల్పాహారం వితరణ చేస్తున్నారు. ఆదివారం ఈ కార్యక్రమంలో నల్లమోతు సిద్దార్ధ పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ సభ్యులతో కలిసి రోగులకు, అటెండెంట్స్ కు అల్పాహారం వితరణ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, పట్టణ ఎస్సీ సెల్ అద్యక్షులు దైద సోము సుందర్, పట్టణ కార్మిక విభాగం అధ్యక్షులు ఐల వెంకన్న, బావండ్ల పాండు, లయన్ మాశెట్టి శ్రీనివాస్, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, దైద వెంకటేశ్వర్లు, దిందే నరసింహ, కోళ్ల వెంకన్న, చిమట శ్రీను, కోల సైదులు, నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking