ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు
నాంపల్లి, అక్షిత న్యూస్ :
నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాంపల్లి లో శ్రీ రాధారుక్మిణి సమేత వేణుగోపాల స్వామి జాతర సందర్భంగా నాంపల్లి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల జడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర రెడ్డి, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి, బిజెపి జిల్లా నాయకులు పూల వెంకటయ్య పాల్గొన్నారు.అనంతరం కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కటింగ్ చేసి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు వార్డు సభ్యులు గాదపాక వేలాద్రి, చాంద్ పాషా ఆర్గనైజర్ కర్ణ యాదయ్య, నాంపల్లి చంద్రమౌళి, కర్నాటి శ్రీనివాసులు, జయపాల్ రెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలింక గురుపాదం, కో ఆప్షన్ సభ్యులు అబ్బాస్, వివిధ మండలాల నుండి విచ్చేసిన క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.