నేటి నుండి బెక్కల్ రామలింగేశ్వర స్వామి బ్రహ్మత్సవాలు ప్రారంభం
మాఘ పూర్ణిమ నుండి శివరాత్రి వరకు మహాజాతర
భక్తులకు సర్వం ఏర్పాట్లు….. చైర్మన్ లింగారెడ్డి
మద్దూరు, అక్షిత న్యూస్ :
సిద్దిపేట జిల్లా దులిపెట్ట మండలం బేక్కల్ గ్రామమున రామచలగుట్టపై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి, మల్లికార్జున స్వాముల వారి ఆలయములున్నవి. ఈ ఆలయంలో ప్రాచీనమైనవే కాక చారిత్రకమైన గొప్ప పుణ్యస్థలం. ఈ ఆలయమునకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఓరుగల్లు నగరం రాజధానిగా పరిపాలించిన నాటి కాకతీయ చక్రవర్తులలో రుద్రమదేవి చక్రవర్తి రాజ్య పరిపాలన కాలమందు క్రీస్తుశకం 1117 స్వస్తిశ్రీ రాక్షన నామ సంవత్సర వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని శ్రీ రుద్రమదేవి చక్రవర్తి ప్రతిష్టాపన చేయించి చిన్న ఆలయము నిర్మింపజేశారు. ఈ ఆలయ పూజారిగా శ్రీ విశ్వేరజిఅను పూజారిని నియమించి ఇతని జీవనోపాధికై వంశపారపర్యమునకు కొంత భూదానము ఇచ్చియుండెను. భద్రంగాపురము ఒక మహానగరముగా వ్యవహరించబడిన ఆకారమున ఓరుగల్లును కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడు పరిపాలిస్తూ ఈ భద్రంగాపురం ప్రాంతమునకు క్రీస్తుశకం 1163 నుండి 1195 వరకు సామంతుడైన మల్లిరెడ్డి అధిపతిగా పరిపాలన చేశాను. ఈయన పరిపాలన కాలం ముందు శ్రీ రుద్ర దేవా చక్రవర్తి నిర్మించే చూసిన చిన్న ఆలయమును చెక్కుచెదరకుండా గర్భాలయంలో ఒక త్రిముఖ దేవాలయమును మరియు అతని పేరు ఒక మల్లికార్జున స్వామివారి ఆలయమునకు అతివిశాలముగా శ్రీ గుండోజి అను శిల్పిచేత అద్భుతంగా నిర్మాణము చేయించి శాసనమునందు శ్రీ మల్లిరెడ్డి వంశావళి కావ్యము వ్రాయబడినది. మొదట దేవి రెడ్డి అతని కొడుకు చందిరెడ్డి అతని పుత్రుడు పున్నిరెడ్డి ఈయన కొడుకు బిరాంరెడ్డి ఈయన సుతుడు కేతన ఈయన పుత్రుడే మలిరెడ్డి తన వంశంలో 21 మందిని పేర్కొని వారిపేరా 21 శివాలయములు ఈ గుట్ట పైన నిర్మింపజేసి వాటిలో శివలింగ ప్రతిష్టాపన చేయించి శ్రీ విశ్వేశ్వరబి వారి వంశమునకు పూజ నైవేద్యమునకై మరికొంత భూమిని మామిడి తోటను దానం ఇచ్చినట్లు వ్రాయబడింది. ఇప్పుడుణ్యక్షేత్రము ఇప్పటికి ఎందరో దీర్ఘ వ్యాధిగ్రస్తులు గ్రహ పీడితులు కొన్ని దినములు ఇచ్చట నియమనిష్టలతో దేవుని ఆరాధించి వారి కష్టములను బాపుకొని ముక్తిని నొంది పోవుచున్నారు ఇట్టి పవిత్రమైన పుణ్యక్షేత్రమును దర్శించి స్వామివారి కృపకు పాత్రులై తరించగలరు.
* జాతర కార్యక్రమ వివరాలు.
5 వ తేదీన మాఘ పౌర్ణమి ఆదివారం రోజున ఉదయం ఐదు గంటలకు శ్రీ రామలింగేశ్వర స్వామి మేలుకొలుపు.ఉదయం ఆరు గంటలకు దిష్టి కుంభం,
*6వ తేదీన మాఘ బహుళ పాడ్యమి సోమవారం రోజున స్వామికి రుద్ర అభిషేకం.
* 7వ తేదీన మాఘ బహుళ విదియ మంగళవారం ఉదయం 8గంటల నుండి స్వామీకీ అభిషేకం,అర్చన
*8తేదీన అమ్మవారి కుంకుమ అర్చనలు అభిషేకాలు, అర్చనలు సిందు కళాకారులచే నాటక ప్రదర్శన.
*15వ తేదీన మాఘ బహుళ దశమి బుదవారం తెల్లవారు జామున 5గంటలకు అగ్ని గుండ ప్రవేశం, తదుపరి వీరభద్ర విజయం గెలుపు కార్యక్రమం జరుపబడును.తదుపరి రుత్విక్ సన్మానం.
16, 17 వ తేదీలలో అభిషేకాలు అర్చనలు జరుపబడును.
18వ తేదీన త్రయోదశి శనివారం రోజున మహాశివరాత్రి సందర్భంగా లింగోద్భవ సమయంలో శ్రీ రామలింగేశ్వర స్వామికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం శ్రీ మల్లికార్జున స్వామి వారి పెద్దపట్నం బెక్కల్ గ్రామ ప్రజలచే బోనాలు నిర్వహించబడును ఆలయ దర్శన వేళలు ఉదయం ఐదు గంటల నుండి 12 గంటల వరకు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కలదు అని రామలింగేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ మన్నె లింగారెడ్డి,డైరెక్టర్లు గొట్టపర్తి వెంకటయ్య లకావత్ రెడ్యా, బొల్లు సుధాకర్, అర్చక బృందం తెలిపారు.