విద్యా రంగానికి 30 శాతం
నిధులు కేటాయించాలి
ఎమ్మెల్యే ముఠా గోపాల్ కు పీడీఎస్ యు వినతి
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశపెట్టనున్న 2023
-24 వార్షిక బడ్జెట్లో విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని పీడీఎస్ యు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పిడిఎస్ యు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కు పీడీఎస్ యు నగర కమిటీ | నాయకులు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్ యు నగర అధ్యక్షులు, మంద నవీన్, ప్రధానకార్యదర్శి పి.నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి విద్యా రంగానికి ప్రభుత్వం సరిపడ నిధులు కేటాయించడం లేదన్నారు. విద్యారంగంలో కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు ఆధిక్యత కనబరుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు అధిక నిధులు కేటాయించాలని కోరారు. దీంతో ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ఉంటాయన్నారు. గతంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన కేజీ టు పీజీ ఉచిత విద్య పథకాన్ని అమలు చేయాలన్నారు. విశ్వ విద్యాలయాలకు సరిపడ నిధులు కేటాయించి, అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఖాళీగానున్న అన్ని రకాల పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విద్యా రంగ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పిడిఎస్ యు నగర ఉపాధ్యక్షులు మందుల సైదులు, నాయకురాలు ధరణి తదితరులు పాల్గొన్నారు.
…