క్రీడా కమిటీకి పది వేల నగదు అందించిన చోప్పరి సాగర్
మద్దూరు అక్షిత న్యూస్: సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని కూటిగల్ గ్రామంలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలకు సంబందించిన మొదటి బహుమతి కోసం 10వేల రూపాయల నగదును ఉమ్మడి మద్దూరు మండల ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు చొప్పరి సాగర్ ముదిరాజ్ కూటిగల్ కబడ్డీ నిర్వహణ కమిటీకి అందజేశారు.ఇలాగే రానున్న రోజుల్లో తమ సహాయ సహకారాలు క్రీడా పోటీల నిర్వహణకు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దోమ బాలమని బాలకృష్ణ, బి అర్ ఎస్ మండల నాయకులు తాళ్ళపల్లి బిక్షపతి, మరియు బి అర్ ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు, క్రీడల నిర్వహణ కమిటీ సభ్యులు, క్రీడాకారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.