పినపాక ఎంపీఓ ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్
పినపాక అక్షిత ప్రతినిధి: పినపాక మండల పంచాయతీ అధికారి శ్రీనివాసులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ అనుదీప్ ఉత్తర్వులు జారీ చేశారు. అధికార దుర్వినియోగానికి అవినీతికి పాల్పడడంతో పాటు మండల పంచాయతీ కార్యదర్శులను తీవ్ర వేధింపులకు గురి చేస్తుండడంతో వచ్చిన ఫిర్యాదు మేరకు సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది.