
క్రీడలతో మానసిక ఉల్లాసం
అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు
మాడుగులపల్లి, అక్షిత న్యూస్ : క్రీడలతో శరీర దారుఢ్యం…మానసిక ఉల్లాసం కలుగుతుంది. మాడుగులపల్లి మండలంలోని ఇందుగుల గ్రామంలో శుక్రవారం అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా గ్రామీణ కబడ్డీ పోటీలను మాజీ జెడ్పిటిసి తండు సైదులు గౌడ్, మాడుగులపల్లి ఎస్సై కైగూరి నరేష్ కుమార్, కట్ట దామోదర్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మనిషి ఆరోగ్యానికి ఎంతో ఆహ్లదాన్నిస్తాయని, క్రీడలతో మానసిక ఉల్లాసం పెరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంత యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ క్రీడా కార్యక్రమం ఉద్దేశించి ఎస్ఐ నరేష్ కుమార్ అంబేద్కర్ యూత్ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎర్ర కన్నయ్య, మీసాల రాములు, మునుగోటి యాదగిరి, దర్శనం శ్యామ్, క్రీడ నిర్వాహకులు పందిరి సురేష్, కిన్నెర శంకర్, శ్రీకాంత్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.