గురుకులాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

గురుకులాలలో ప్రవేశాలకు
దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గురుకులాలలో 5వ తరగతి ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సీయల్ విద్యాలయం సంస్థ జాయింట్ సెక్రటరీ కె.శారద తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన వి ద్యను అందిస్తూ సహజ సిద్ధమైన నైపుణ్యాలను వెలికితీ సేందుకు ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలల్లో 2023..24 వార్షిక సంవత్సరాని కి ఏప్రిల్ 23న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులు టీఎస్ డబ్ల్యూఆర్ఐఎస్, టీటీడబ్ల్యూఆర్ఐఎస్, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఐఎస్, టీఆర్అఐఎస్ గురుకులాలలో 5వ తరగతి అడ్మిషన్ పొందనున్నట్టు చెప్పారు.

ఎంపిక పాత జిల్లాల ప్రకారం జరుగుతోందన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం 2022..23లో 4వ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. విద్యార్థులు తమ అర్హతలను పరిశీలించి ఆన్లైన్లో రూ.100లు ఫీజు చెల్లించి ఫిబ్రవరి 9 నుంచి మార్చి 6వ తేదీ వరకూ దరఖాస్తు చేయాల న్నారు. అభ్యర్థులు ఒకే ఫోన్ నంబరు ద్వారా ఒక దరఖాస్తు మాత్రమే పూర్తి చేయాలన్నారు. మరిన్ని వివరాలకు టీజీసీఇట్ డాట్ సీజీజీ డాట్ గవర్నమెంట్ డాన్ ఇన్ వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking