
మండల పరిషత్ మీద
ఎమ్మెల్యే పెత్తనం ఏంది ?
*జడ్పీ మీటింగ్ లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నకిరేకల్ ఎంపీపీ*
నకిరేకల్, అక్షిత ప్రతినిధి :
వాడివేడిగా నల్లగొండ జడ్పిమీటింగ్ జరిగింది. నకిరేకల్ మండలంలోని కొంతమంది అధికారులు స్థానిక ఎమ్మెల్యేకు భయపడి మా హక్కులను కాలరాస్తున్నారని, మండలపరిషత్ మీద ఎమ్మెల్యే పెత్తనం ఏందని ఎంపీపీ ప్రశ్నించారు.ఇంచార్జి ఎంపీడీఓ లక్ష్మారెడ్డి తన విదులు సరిగ్గా నిర్వహించడం లేదని, ఎసిబి కేసులున్న ఎంపీడీవో మా కొద్దని, రెగ్యులర్ ఎంపిడిఓను కేటాయించాలని జిల్లా పరిషత్ ఉన్నతాధికారులకు ఎంపీపీ శ్రీదేవి సమావేశంలో విన్నవించారు. అధికారులు స్థానిక ఎమ్మెల్యే ఏదిచేపితే అదిచేస్తూ, ప్రోటోకాల్ పాటించకుండా,మమ్మల్ని ఏపని చేయనీయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇటీవల జరిగిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారిక కార్యక్రమానికి సహీతం ప్రొటోకాల్ పాటించలేదని ఎంపీపీ ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది అధికారులను ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎంపీపీ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన ప్రశంస పత్రాల కార్యక్రమం కూడా ఎమ్మెల్యే నిలిపివేశారని పేర్కొన్నారు. అధికారిక కార్యక్రమాలకు సమాచారం ఇవ్వడంలేదని జెడ్పీ చైర్మన్, కలెక్టర్ దృష్టికి ఎంపీపీ తీసుకొచ్చారు.