ఈ రేసు.. మస్తు జోష్! దేశంలో తొలిసారి జరిగిన ఫార్ములా.

  • ‘హైదరాబాద్‌ ఈ-ప్రీ’ విజేత జీన్‌ ఎరిక్‌ వెర్నే
  • అభిమానుల భారీ స్పందన
  • సూపర్‌ స్పీడ్‌తో దూసుకెళ్లే ఫార్ములా కార్లను టీవీల్లో చూడడమే కానీ.. ఎరుగని భాగ్యనగర వాసులకు సరికొత్త అనుభవం. దేశంలో తొలిసారి జరిగిన ఫార్ములా.

హైదరాబాద్‌, అక్షిత ప్రతినిధి: థ్రిల్లింగ్‌ ఫైనల్‌ రేసులో వ్యూహాత్మకంగా వ్యవహరించిన డీఎస్‌ పెన్స్‌కీ డ్రైవర్‌ జీన్‌ ఎరిక్‌ వెర్నే తొలి ‘హైదరాబాద్‌ ఈ-ప్రీ’ విజేతగా నిలిచాడు. శనివారం జరిగిన 33 ల్యాప్‌ల రేసులో చివరి ల్యాప్‌లో హైడ్రామా నెలకొన్నా.. చాకచక్యంగా అధిగమించిన జీన్‌ అగ్రస్థానంలో నిలవగా.. అతడితో తీవ్రంగా పోటీపడిన ఎన్విసన్‌ రేసింగ్‌ డ్రైవర్‌ నిక్‌ కసీడి రెండో స్థానంలో, ఆంటోనియో ఫెలిక్స్‌ డి కోస్టా (పోర్షే) డ్రైవర్‌ మూడో స్థానంలో నిలిచాడు చివరి ల్యాప్‌లో జీన్‌ వద్ద ఉపయోగించుకోవడానికి ఒక్క శాతం ఎనర్జీ మిగిలుండగా.. కసీడి వద్ద నాలుగు శాతం ఉంది. కానీ, రక్షణాత్మకంగా వ్యవహరిస్తూనే ఎనర్జీని కాపాడుకొన్న వెర్నే.. దాదాపు రెండేళ్ల తర్వాత టైటిల్‌ నెగ్గాడు. విన్నంగ్‌ లైన్‌ దాటేటప్పుడు జీన్‌ కారులో 0.5 శాతం ఎనర్జీ మాత్రమే మిగిలి ఉంది. ఓవర్‌ పవర్‌ ఉపయోగించినందుకు సెబాస్టియన్‌ బ్యూమీ (ఎన్విసన్‌ రేసింగ్‌)కి 17 సెకన్ల పెనాల్టీ విధించడంతో.. డి కోస్టా పోడియం ఫినిష్‌ చేసే అవకాశం దక్కింది. 23వ ల్యాప్‌లో మెక్‌ లారెన్‌ డ్రైవర్‌ జేక్‌ మ్యూస్‌ క్రాష్‌ కారణంగా సేఫ్టీ కారు ట్రాక్‌పైకి రావడంతో.. రేసు ముగింపు ఉత్కంఠభరితంగా జరిగింది. రేసును జీన్‌ 46 నిమిషాల 01.99 సెకన్ల టైమింగ్‌తో ముగించి టాప్‌లో నిలిచాడు.

స్టార్ల హంగామా..

ప్రతిష్ఠాత్మక ఫార్ములా ఈ-రే్‌సను వీక్షించేందుకు మోటార్‌ స్పోర్ట్స్‌ ప్రేమికులు భారీగా తరలి రావడంతో హుస్సేన్‌ సాగర్‌ తీరం జనసంద్రమైంది. పదేళ్ల తర్వాత భారత్‌లో జరుగుతున్న తొలి వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప స్థాయి రేసు గురించి ఎఫ్‌ఐఏ అధ్యక్షుడు మహ్మద్‌ బెన్‌ సులాయమ్‌ ప్రకటన చేశాడు. దేశంలో మొదటిసారి జరిగిన ఫార్ములా ఈ-రే్‌సను తిలకించేందుకు లెజెండరీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌తో పాటు శిఖర్‌ ధవన్‌, దీపక్‌ చాహర్‌, యజ్వేంద్ర చాహల్‌ విచ్చేశారు. వీరంతా పలు కార్లను తిలకిస్తూ రేసింగ్‌ వద్ద సందడి చేశారు. సినీ ప్రముఖులు రామ్‌ చరణ్‌, నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌, కేజీఎఫ్‌ హీరో యష్‌, జొన్నలగడ్డ సిద్ధు, దుల్కర్‌ సల్మాన్‌, పవన్‌కళ్యాణ్‌ తనయుడు అకీర, మహే్‌షబాబు తనయుడు గౌతమ్‌ తదితరులు హాజరయ్యారు. ఫినిన్‌ఫర్నియా బటిస్టా ఈవీ కార్‌లో సచిన్‌, హీరో రామ్‌చరణ్‌ వేర్వేరుగా ప్రయాణం చేశారు. ఏపీకి చెందిన మంత్రి గుడివాడ అమర్నాథ్‌, మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌ నాయుడు, సీఎం రమేశ్‌ తదితరులు రేస్‌ను వీక్షించారు. పెద్దఎత్తున విదేశీయులు తరలివచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking