
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
తెలంగాణ ఆర్టీసీని
బలోపేతానికి ప్రభుత్వం కృషి
కోదాడ టౌన్, అక్షిత న్యూస్ :
గత పాలకుల విధానాలతో ఆర్టీసీ నష్టాల ఊబిలో పడిందని, లాభాల బాటలో తెలంగాణ ఆర్టీసీని తెచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం కోదాడ ఆర్టీసీ డిపోలో డిపోకు మంజూరు అయిన కొత్త బస్సులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణికులకు సురక్షిత ప్రయాణమని, ప్రజలు ఆర్టీసీని ఆదరించాలన్నారు. ఆర్టీసీ బస్సుల్లో భద్రతతో కూడిన సురక్షిత ప్రయాణం ఉంటుందన్నారు. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీని అన్ని విధాలుగా బలోపేతం చేస్తుందన్నారు. ప్రయాణ ప్రాంగణాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తుందన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఆర్టీసీ నష్టాల ఊబిలో కురుకుపోయిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని లాభాలను బాటలో నడిపేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలన్నిటిని ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. ప్రజల సౌకర్యం కోసం ప్రయాణంతో పాటు సరుకుల రవాణాకు కార్గో సర్వీసులు కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు భరోసా ఉంటుందన్నారు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దన్నారు. ప్రజలు ఆర్టీసీని ఆదరించాలన్నారు. కోదాడ ఆర్టీసీ డిపో బలోపేతానికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కవితా రాధారెడ్డి, వైస్ చైర్మన్ వెంపటి పద్మ మధుసూదన్ రావు, రాయపూడి వెంకట్ నారాయణ, డిపో మేనేజర్ డి శ్రీహర్ష, ఆఫీస్ సూపరిండెంట్ సిహెచ్ నాగిరెడ్డి, బి సైదులు, బి సుగుణాకర్ తదితరులు పాల్గొన్నారు.