
*వేములపల్లిలో బిజెపి కార్నర్ మీటింగ్*
అక్షిత ప్రతినిధి, వేములపల్లి :
ప్రజాగోస బిజెపి భరోసా యాత్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం వేములపల్లి మండల కేంద్రంలో శక్తి కేంద్రాల స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ను బిజెపి మండల అధ్యక్షుడు చిర్ర సాంబమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సమావేశంలో మిర్యాలగూడ అసెంబ్లీ బిజెపి పాలక్, సినీనటి కవిత ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సామాన్యుల కోసం ప్రవేశపెట్టిన ఈ శ్రామ్ కార్డులు,ఆయుష్మాన్ భారత్ గురించి ప్రజలవద్దకు తీసుకొని వెళ్లి,కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు.రైతులకు ఫసల్ బీమా పథకం, కిసాన్ సంయోజన నిధి,ఎరువుల సబ్సిడీ, ఉజ్వల గ్యాస్,జీవన్ జ్యోతి తదితర పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు.గ్రామాలలో 15వ ఆర్థిక సంఘం నిధుల క్రింద చేపట్టిన అభివృద్ధి పనులు,సీసీ రోడ్లు, వైకుంటదామాలు, పల్లెప్రకృతి వనాలు తదితర అభివృద్ధి పనులు కేంద్రం నిధులతోనే జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలోబీజేపీ అసెంబ్లీ కన్వీనర్ రతన్ సింగ్ నాయక్, నాయకులు సత్యప్రసాద్, పుట్టల సందీప్, పందిరి భాగ్యమ్మ, పందిరి రాజేష్, తోట మధు, మాలి దామోదర్ రెడ్డి, జవ్వాజి సత్యనారాయణ, రవి, హరికృష్ణ , తదితరులు పాల్గొన్నారు.