ఐదో అదనపు జిల్లా జడ్జిగా కవిత

బాధ్యతలు చేపట్టిన ఐదో అదనపు జిల్లా జడ్జి కవిత
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ ఐదో అదనపు జిల్లా జడ్జిగా కె.కవిత సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహించిన రఘునాధరెడ్డి మల్కాజిగిరి కోర్టుకు బదిలీ కాగా నల్లగొండ జిల్లా ఎస్సి, ఎస్టి అట్రాసిటీ స్ జడ్జి తిరుపతి ఇంచార్జి గా ఉన్నారు. నూతన జడ్జికి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాగతం కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ కేసులు సత్వరం పరిష్కారానికి, కక్షిదారులకు న్యాయమందించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఆశాలత, ఒకటో అదనపు జూనియర్ సివిల్ జడ్జి సుమబాల, వి.మాధవి న్యాయవాదులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking