అలీ ఖాన్ కు ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ స్టార్ అవార్డు

మిర్యాలగూడ నివాసి మూసా అలీఖాన్ కు ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ స్టార్ అవార్డు ప్రధానం
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో అంగరంగ వైభవంగా జరిగిన అవార్డు వేడుకలో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ స్టార్ అవార్డును నటుడు, నిర్మాత, సామాజికవేత్త మూసా అలీ ఖాన్ కు ప్రధానం చేశారు. వంశీ ఈవెంట్స్ అండ్ మోర్ద్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన వేడుకలో సినీ నటుడు అలీ సతీమణి జుబేదా అలీ, నటి సంధ్యా జనక్ అలీ ఖాన్ ను శాలువాతో ఘనంగా సత్కరించి, అవార్డును ప్రధానం చేశారు. జుబేదా ప్రముఖులు మాట్లాడుతూ మూసా అలీ ఖాన్ సామాజికంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు సినిమా రంగంలోనూ ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తూ ఆత్మీయంగా నిలుస్తున్నారని అభినందించారు. అలీ ఖాన్ మాట్లాడుతూ తనను అవార్డుకు ఎంపిక చేసిన వంశీ ఈవెంట్స్ మోర్ద్ ఫౌండేషన్ నిర్వాహకులు వంశీకృష్ణ, డాక్టర్ అందేకర్ శ్రీనివాస్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎంతోమంది సినీ, రాజకీయ, సామాజిక సేవారంగ ప్రముఖులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking