దాతల ప్రోత్సాహం అవసరం

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించుటకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని మండల విద్యాధికారి బాలాజీ నాయక్ తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యాద్గార్ పల్లి నందు 35 మంది పదవ తరగతి విద్యార్థులకు పేరుమల్ల లలిత అంజయ్య ఆర్థిక సహకారంతో స్టడీ మెటీరియల్ను అందిస్తూ 10వ తరగతి పరీక్షలకు సన్నద్ధం కావడానికి ఈ స్టడీ మెటీరియల్ ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. నిరుపేద విద్యార్థులు ఉత్తమ జిపిఎతో ఉత్తీర్ణత సాధించుటకు 14 వేల రూపాయల విలువగల మెటీరియల్ అందించుటకు పెరుమళ్ళ అంజయ్య  ముందుకు రావడం అభినందనీయమని వారు ఇచ్చిన దాతృత్వంతో విద్యార్థులు అత్యుత్తమ జిపిఏతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. పదో తరగతి విద్యార్థులకు ఉదయం సాయంత్రం అదనపు తరగతులు నిర్వహిస్తూ ప్రభుత్వమే ఉపకారం మంజూరు చేసిందని విద్యార్థులు సద్వినియోగపరుచుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోలా శ్రీనివాస్, దాత పేరు మల్ల లలిత, ఉపాధ్యాయులు శ్రీశైలం, వెంకటయ్య, సయ్యద్ బాబా, శైలజ, తనీష్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking