లక్ష్యానికి మించి సుఖన్య సమృద్ది యోజన

సుకన్య సమృద్ధి యోజన కింద లక్ష్యానికి మించి ఖాతాలు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

సూర్యాపేట పోస్టల్ డివిజన్ పరిధిలో సుకన్య సమృద్ధి యోజన కింద 1615 ఖాతాలు లక్ష్యంగా పెట్టుకొని రెండు రోజుల్లో లక్ష్యానికి మించి 1652 ఖాతాలు తెరచి రికార్డ్ సృష్టించిందని తపాలా శాఖ సూపరింటెండెంట్ వడ్లమూడి వెంకటేశ్వర్లు తెలిపారు. రాష్ట్రంలో 0-10 సం|| లోపు వయసు గల ఆడపిల్లలు 18.81 లక్షలు ఉన్నారు.ఈ ఆడపిల్లల తల్లిదండ్రులు అధిక వడ్డీ గల, అత్యంత లాభదాయకమైన ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని లబ్ది పొందాలని ఆయన కోరారు. 0-10 సంవత్సరాల లోపు వయస్సు గల ఆడపిల్లలు అర్హులని, పుట్టిన తేదీ ధృవ పత్రం, రెండు ఫోటోలు ఉండాలన్నారు. పథకంలోని ప్రత్యేక ఆకర్షణలు…ఆదాయ పన్ను రాయితీ, ఆన్ లైన్ పేమెంట్ సౌకర్యం…పాప ఉన్నత చదువులకు సగం సొమ్ము వాపసు తీసుకునే సౌలభ్యం
అత్యధిక 7.6శాతం వడ్డీ రేటుతో రూ.250తో ఖాతా ప్రారంభించవచ్చన్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 1,50,000 రూపాయల వరకు జమ చేసుకోవచ్చన్నారు. పదేళ్ల లోపు వయసు గల ఆడ పిల్లల తల్లిదండ్రులు ఖాతా ఓపెన్ చేసి లబ్ది పొందాలని ఆయన సూచించారు. ఆయన వెంట అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎండి.నయీమోద్దీన్ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking