శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని జరపాలి

*ప్రతి గిరిజన తండాల్లో శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని జరపాలి*

*గిరిజన శక్తి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి కెళవత్ మధు నాయక్*
హుజూర్నగర్ రూరల్, అక్షిత న్యూస్ :

గిరిజనుల ఆరాధ్య దైవమైన సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఈనెల 15వ తారీకున ఉన్నందున ప్రతి గిరిజన తండాల్లో ప్రభుత్వమే నిర్వహించాలని గిరిజన శక్తి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మధు నాయక్ ప్రభుత్వానికి కోరారు సోమవారం పాలక వీడు మండల కేంద్రము లో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సేవాలాల్ మహారాజ్ జయంతిని గుర్తించి అధికారికంగా నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అని ప్రభుత్వం అధికారికంగా నియోజవర్గ స్థాయిలో నిర్వహిస్తున్నారని అలా కాకుండా ప్రతి గిరిజన తండాల్లో నిర్వహించే విధంగా ప్రణాళికలు ఏర్పాటు చేయాలని అప్పుడే సేవాలాల్ మహారాజ్ కు నిజమైన నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు అదేవిధంగా సేవలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు

Leave A Reply

Your email address will not be published.

Breaking