
ఎమ్మెల్సీ డాక్టర్ బండ ప్రకాష్ ను మర్యాద పూర్వకంగా కలసిన వార్డ్ మెంబర్ దొంతి శేఖర్ ముదిరాజ్..
శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి :
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైన శుభ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ బండ ప్రకాష్ ని మర్యాద పూర్వకంగా కలసిన శేరిలింగంపల్లి నియోజకవర్గం హాఫిజ్ పెట్ డివిజన్ వార్డ్ మెంబర్ దొంతి శేఖర్ ముదిరాజ్ సభ్యులు సతీష్ ముదిరాజ్ ,వి యాదగిరి ముదిరాజ్ ,దొంతి రాజేందర్ ముదిరాజ్ ,దొంతి నరసింహ ముదిరాజ్ కలిసి ఎమ్మెల్సీ డాక్టర్ బండ ప్రకాష్ ని పూల బోకే శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.