
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలి
సురేష్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ టౌన్, అక్షిత న్యూస్ :
వైద్యాన్ని వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో నిర్వహించాలని కోదాడ అభివృద్ధి ప్రధాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలో నూతనంగా నిర్మించిన సురేష్ ఆర్థోపెడిక్ వైద్యశాలను ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.జాతీయ రహదారిపై ఉన్న కోదాడ నియోజకవర్గంలో పలు గ్రామాల ప్రజలు ప్రమాదాలకు గురై ప్రాణాపాయ స్థితిలో వైద్యశాలలకు వస్తున్నారని అటువంటి క్షతగాత్రులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడాలన్నారు. దేవుడు జన్మనిస్తే ప్రాణాలు కాపాడే దేవుళ్ళు భూమిపై డాక్టర్లని వైద్యుల సేవలు ఎనలేనివి అని కొనియాడారు. నగరాలకే పరిమితమే ఉన్న కార్పొరేట్ స్థాయి వైద్యం పేదలకు అందించాలన్నారు. సేవా దృక్పథంతో పనిచేస్తున్న వైద్యశాలలకు ప్రభుత్వ పక్షాన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు ఈ సందర్భంగా వైద్యశాల యజమాన్యం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి, డాక్టర్ సురేష్, డాక్టర్ ప్రమీల శ్రీపతి రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు పైడిమర్రి సత్యబాబు, తుమ్మలపల్లి భాస్కర్, కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి, పట్టణ కౌన్సిలర్లు కల్లూరి పద్మజ, కందుల కోటేశ్వరరావు, గుండెల సూర్యనారాయణ, డాక్టర్ బ్రహ్మం, సాదిక్, టిఆర్ఎస్ నాయకులు సంపేట ఉపేందర్, వెంకటరత్నం, బత్తుల ఉపేందర్, వంశీ, ప్రముఖ డాక్టర్లు, టిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.