
వెస్ట్ ఎండ్ హౌసింగ్ ఫైనాన్స్ కు
చైర్మన్ గా జగదీష్ కపూర్
ముంబాయి, అక్షిత ప్రతినిధి :
ముంబాయి కేంద్రంగా ఉన్న అందుబాటు ధరల్లోని హౌసింగ్ కంపెనీ, వెస్టెండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ సుప్రసిద్ధ బ్యాంకర్ జగదీష్ కపూర్‌ను తమ ఛైర్మన్‌గా నియమించింది. ముంబాయిలో 10 ఫిబ్రవరి, 2023న నిర్వహించిన తమ సమావేశంలో బోర్డు ఈ నియామకాన్ని చేసింది. జగదీష్ కపూర్ ఆర్థిక రంగంలో ఒక ఘనమైన కెరీర్‌ను కలిగి ఉన్నారు. ఆయన భారత రిజర్వ్ బ్యాంకుకు డిప్యూటీ గవర్నర్‌గా సేవలు అందించారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కు, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజికి ఛైర్మన్‌గా పని చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, నేషనల్ హౌసింగ్ బ్యాంక్, నాబార్డ్, ఎక్సిమ్ బ్యాంక్ లాంటి అనేక అగ్రశ్రేణి బ్యాంకుల బోర్డుల్లో సేవలు అందించారు.

ఈ నియామకం గురించి పంకజ్ గుప్తా, ఛైర్మన్, వెస్ట్ ఎండ్ గ్రూప్ మాట్లాడుతూ “వెస్ట్ ఎండ్ హౌసింగ్ ఫైనాన్స్ ఛైర్మన్‌గా మా బోర్డులోకి జగదీష్ కపూర్ లాంటి ప్రముఖ నిపుణుడు చేరడాన్ని మేము గౌరవంగా, సంతోషంగా భావిస్తున్నాం. రాబోయే సంవత్సరాల్లో మా వృద్ధి ప్రయాణానికి అతని దార్శనికత, అనుభవం మరియు మార్గదర్శకత్వం కీలకం అవుతాయని మేము విశ్వసిస్తున్నాం” అని చెప్పారు.