
బెల్లం వేణుని అరెస్టు చేయాలని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం కలెక్టరేట్ గ్రీవెన్స్ లో ఖమ్మం రూరల్ మండలం టిఆర్ఎస్ మండల అధ్యక్షులు బెల్లం వేణు ఐదు రోజుల క్రితం దేవాదాయ శాఖలో పనిచేస్తున్న సమత అనే ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ పై అనుచితంగా దుర్భాషలాడటం వలన ఆమె మానసికంగా ఆందోళనకు గురై మనస్థాపం చెంది ఆత్మహత్య ప్రయత్నం చేసినది.బెల్లం వేణు పై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి అరెస్టు చేయాలని కలెక్టర్ విపి గౌతమ్ కి వినతించారు.ఈ మధ్యకాలంలో బహుజనులపై ఆధిపత్య కులాల దాడులు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. అధికారులకు న్యాయవాదులకు కూడా రక్షణ లేనప్పుడు ఒక సామాన్య పౌరుడికి ఏ విధంగా రక్షణ కల్పిస్తుంది.ఈ తారహ దాడులను నియంత్రించాలని ఇటువంటి సంఘటన మరోసారి పునరావృతం కాకుండా చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఐక్యవేదిక చైర్మన్ డాక్టర్ కె వి కృష్ణారావు కన్వీనర్ గుంతేటి వీరభద్రయ్య కో కన్వీనర్ బద్రు నాయక్ పెరుగు వెంకటరమణ యాదవ్ నకరికంటి సంజీవరావు రిపబ్లిక్ పార్టీ ఉమ్మడి జిల్లాల ఇంచార్జ్ అబ్దుల్ రెహమాన్ వల్లేపు సోమరాజు మాల మహానాడు నాయకులు దాసరి శ్రీనివాస్ గొట్టే ముక్కల శ్రీనివాస్ ఎల్ హెచ్ పి ఎస్ నాయకులు బొడ సతీష్ నాయక్ వీరన్న నాయక్ శంకర్ నాయక్ ఐక్యవేదిక మహిళా నాయకులు ఉపేంద్ర నాయక్ రమ్య తదితరులు పాల్గొన్నారు.