
వర్కర్లు కాదు…మార్ట్ లకు ఓనర్లు
వ్యాపార వేత్తలుగా దళితులు
బంధుతో…దళితుల జీవితాల్లో వెలుగులు
ఎస్సీ కార్పొరేషన్ ఈడి శ్రీనివాస్
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
మార్ట్ లు… మాల్ లో వర్కర్లు కాదు… మార్ట్ లకు ఓనర్లుగా దళితుల వ్యాపార రంగ ప్రవేశం. దళితుల ఆర్థిక పరిపుష్టికి ఉద్దేశించిన దళిత బంధు వాళ్ల జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతుంది. బడా మాల్స్ లో వర్కర్లుగా పనిచేసిన అనుభవం సీఎం కేసిఆర్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళిత బంధుతో మార్ట్, మాల్ లకు ఓనర్లను చేజేసింది. నల్గొండ జిల్లాలో దళిత బంధు పథకం కింద గుండ్లపల్లి మండలంలోని సింగరాజ్ పల్లి గ్రామానికి చెందిన దళిత బంధు లబ్దిదారులు నలుగురు కలిసి గ్రూప్ గా జంతుక రామకృష్ణ, పాలె శాంతమ్మ, ఎలిమినేటి లక్ష్మమ్మ, ఎలిమినేటి కళమ్మ ఏర్పడి హైదరాబాద్ లోని అల్మాస్ గూడ ప్రాంతములో ఏర్పాటు గావించిన సూపర్ మార్కెట్ ను ఎస్సీ కార్పొరేషన్ ఈడి శ్రీనివాస్ క్షేత్ర పరిశీలన చేశారు.

ఈ యూనిట్ దళిత బంధు పథకపు నిధులు రూ.39 లక్షల 60 వేలతో లబ్దిదారుల ఇష్టo మేరకు మరో రూ.20 లక్షలు మొత్తంగా రూ.59 లక్షల 60 వేలతో యూనిట్ ను చేశారు. ఈ యూనిట్ ను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన సమయములో సంబంధిత లబ్దిదారులు ఇట్టి పథకము వారికి అందించినందులకు ధన్యవాదములు తెలిపి, గతములో వారు మార్కెటింగ్ ఏజెంట్ ల గాను, వివిధ ఏజెన్సీల యందు వర్కర్స్ గాను నెలసరి, దినసరి వేతనముతో పనిచేశామని, ప్రభుత్వ చేయుతతో మాల్ ఓనర్లుగా పనిచేసుకుంటున్నామని చెప్పారన్నారు. ఆయా మాల్స్ లో పనిచేసిన అనుభవము ప్రకారo యూనిట్ ఏర్పాటుకు మార్గం సుగమమైందని చెప్పారు.మా కుటుంబాలతో పాటుగా మరొక ఐదు కుటుంబాలకు ఉపాధి కల్పించటం జరుగుతుందని లబ్దిదారులు గుర్తు చేశారని శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ప్రతి రోజు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతి నెల సుమారు రూ.లక్షా25 వేల ఆదాయo వస్తుందని చెప్పారు. భవిష్యత్తులో మా యూనిట్ ను పెద్ద సూపర్ మార్కెట్ గా ఏర్పాటు చేసి మాతో పాటు మరి కొంత మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంతో పని చేయుచున్నామని లబ్దిదారులు ధీమా వ్యక్తం చేశారన్నారు. ఈ సందర్బంగా కార్యనిర్వాహక సంచాలకులు శ్రీనివాస్ మాట్లాడుతూ దళిత బంధు పథకము ద్వారా సూపర్ మార్కెట్ ను గ్రూప్ గా ఏర్పర్చుకోవడo…ఆధునిక పద్దతిలో సి.సి. కెమరాలను, కంప్యూటరు బిల్లులు, జీఎస్టీతో కూడిన బిల్లులు, బ్యాంకు లావాదేవీలు, కరెంట్ అకౌంట్ ద్వారా ఆధునాతనమైన ఫ్రీడ్జ్ లు ఆకర్షించు ఫర్నిచర్, క్రమ పద్దతిలో అమర్చిన మెటీరియల్ పెద్ద కార్పొరేటర్ లు (రిలయన్స్, మోర్, డి–మార్ట్) తరహాలో పటిస్టవంతంగా చేపట్టడం అభినందనీయమన్నారు. దళిత బంధుతో ఆయా వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.