బాధిత కుటుంబానికి బియ్యం వితరణ
పినపాక అక్షిత ప్రతినిధి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని గొల్లగూడెం సమత్ మోతె గ్రామానికి చెందిన కుంజ రంగయ్య ఇటీవల కాలంలో అనారోగ్యానికి గురై మరణించారు.స్పందించిన బీఆర్ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి 50 కేజీల బియ్యం దిశదినకర్మలకు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఇరుప విజయకుమార్,యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్,ఉప సర్పంచ్ చేను సాంబయ్య,గ్రామ కమిటీ అధ్యక్షులు ఎల్లబోయిన సత్యం,గ్రామ కమిటీ సభ్యులు కుంజ లక్ష్మయ్య,మలకం వెంకటేశ్వర్లు,ముండ్రాతి రమేష్,ఇరుప
నాగేష్,సుతారి నాగేష్, మోడెం అంజయ్య,బట్ట బిక్షపతి,మలకం పుల్లయ్య, కుంజ నరసింహారావు,ఇరుప కృష్ణ తదితరులు పాల్గొన్నారు.