ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి
సులోచనారాణి తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహణపై మంగళవారం ఆమె షెడ్యూలు విడుదల
చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు జరుగనున్న ప్రాక్టికల్
పరీక్షలు నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 61 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మూడు దశలగా జరుగు ఈ
ప్రాక్టికల్ పరీక్షలకు ఒకేషన్ కోర్సు చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థులు 2363 మంది, ఒకేషనల్ రెండవ
సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 1943 మంది అలాగే సెకండ్ ఇయర్ చదువుతున్న జనరల్ విద్యార్థులు 5073
మంది మొత్తం 9379 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరవుతున్నట్లు ఆమె చెప్పారు. ఉదయం 9 గంటల
నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించడం
జరుగుతుందని చెప్పారు. మూడు దశలగా నిర్వహించనున్న ఈ పరీక్షలు మొదటి దశ ఈ నెల 15వ తేదీ నుండి 20వ
తేదీ వరకు, రెండవ దశ ఈ నెల 21వ తేదీ నుండి 25వ తేదీ వరకు, మొదటి దశ ఈ నెల 26వ తేదీ నుండి వచ్చే నెల
2వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని ఆమె తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహణకు జిల్లాస్థాయిలో
ముగ్గురు అధికారులు, అలాగే రెండు ఫ్లెయింగ్ స్క్వాడ్స్, 16 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 27 మంది ఛీఫ్
సూపరిండెట్లు విధులు కేటాయించినట్లు చెప్పారు. విద్యార్థులు ఏదేని, సలహాలు సూచనలు కొరకు 7997994366,
9490969965 ఏర్పాటు చేయబడిన కంట్రోల్ రూము నెంబర్లు లకు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవాలని
ఆమె సూచించారు.