ప్రేమవతి పేటలో కార్పొరేటర్ పర్యటన.

ప్రేమవతి పేటలో కార్పొరేటర్ పర్యటన.
రాజేంద్రనగర్, అక్షిత ప్రతినిధి:
మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని ప్రెమవతి పెట్ లో అభివృద్ది పనులలో భాగంగా నూతన సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ సమస్య, ప్యాచ్ వర్క్ మరియు నూతన విధి దీపాల కోసం తదితర మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషిచేస్తానని డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా జిహెచ్ఎంసి అధికారులు,పార్టీ నాయకులు, బస్తీ వాసులతో కలిసి కాలనీ పాదయాత్ర చేస్తూ విసృతంగా పర్యటించారు. ప్రధానంగా అంబేద్కర్ సంఘానికి మౌళిక సదుపాయాల కోసం కూడా చర్చించసారు.ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ… కాలనీ లో నెలకొన్న ప్రజా సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. బస్తీ వాసులు పలు సమస్యలను కార్పొరేటర్ గారి దృష్టికి తీసుకోని రావడం జరిగింది. ఆయన మాట్లాడుతూ… కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన మౌళిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కృషి చేస్తున్నామన్నారు. ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు సమస్యలు తలెత్తకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మైలర్ దేవ్ పల్లి డివిజన్ గ్రేటర్ హైదరాబాద్ లోనే అన్ని రంగాల్లో ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చి దిద్దడానికి ప్రత్యేక ప్రణాళిక, కార్యాచరణ తో ముందుకు వెళ్తున్న మన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్ ముదిరాజ్, డివిజన్ అధ్యక్షుడు అడికే జనార్థన్, రఘు ముదిరాజ్, టి. చిన్న, ఏ.రవి, ఎడ్లకాడి సూర్యం, ఏ. సుమన్, గడ్డం నవీన్, శ్రీకాంత్ రెడ్డి, బబ్లూ, జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ రాహుల్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సమేష్, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking