రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి భరోసా పల్లె, బస్తీ దఖానాలతో ప్రజల ముంగిటకు వైద్య సేవలు

రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి భరోసా

పల్లె, బస్తీ దఖానాలతో ప్రజల ముంగిటకు వైద్య సేవలు

పుట్టిన ప్రతి పసిబిడ్డ నుండి కురువృద్ధుల వరకు ఉచితంగా వైద్యం

ముఖ్యమంత్రి సహాయనిధి పథకం తో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నాం

షుగర్, బిపి వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఉచితంగా మందుల పంపిణీ
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ టౌన్; అక్షిత న్యూస్, :
ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి భరోసానిస్తుందని కోదాడ అభివృద్ధి ప్రధాత శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని ఎస్ఆర్ఎమ్ స్కూల్లో అర్బన్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన దీర్ఘకాలిక వ్యాధులు బిపి, షుగర్ వంటి వ్యాధులకు యన్ సి డి కిట్స్ ను రోగులకు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల కాలంలో ఖరీదైన వైద్యం పేదలకు అందని ద్రాక్షగా ఉండేది అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ఆరోగ్య రక్షణ లక్ష్యంగా వైద్య రంగాల్లో అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారన్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధి పథకంతో వేలాది రూపాయలు మంజూరు చేసి కార్పొరేట్ వైద్యం అందిస్తూ పేదల ప్రాణాలకు భరోసా ఇస్తున్నారన్నారు.గత ప్రభుత్వాల హయం గ్రామాల్లో వైద్యశాల లేక సమయానికి వైద్యం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోయారని నేడు తెలంగాణ ప్రభుత్వం పల్లెల్లో పట్టణాల్లో బస్తి దావకానాలను ఏర్పాటు చేసి వైద్యులను అందుబాటులో ఉంచి సత్వరం వైద్యం అందిస్తుంది అన్నారు. పుట్టిన పసి బిడ్డను మొదలుకొని వయోవృద్ధుల వరకు అన్ని రకాల వైద్య సేవలను ప్రభుత్వ వైద్యశాల నుండి అందిస్తున్నామన్నారు. బీపీ షుగర్ థైరాయిడ్ టీ బి వంటి వ్యాధులకు ఎన్ జిసి కిట్ల ద్వారా ఖరీదైన మందులను ఉచితంగా ప్రభుత్వం అందిస్తుంది అన్నారు ప్రభుత్వం కృషితో ప్రభుత్వ వైద్యశాలలో సాధారణ కాన్పులు పెరిగాయన్నారు తల్లి గర్భం నుండి బిడ్డకు రక్షణ ఇస్తుండడంతో పసిపిల్లల మరణాలు తగ్గాయని చెప్పారు మాతా శిశు సంరక్షణ కోసం వైద్య ఆరోగ్యశాఖ అంగన్వాడి విద్యా శాఖల ద్వారా అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు ప్రభుత్వ అందించే సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారి కోటాచలం, ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి, ప్రోగ్రాం జిల్లా అధికారి కళ్యాణ్ చక్రవర్తి, యాతాకుల మధుబాబు, స్థానిక కౌన్సిలర్ కట్టెబోయిన జ్యోతి శ్రీనివాస యాదవ్, కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు, నాయకులు పట్టణ కౌన్సిలర్లు కందుల కోటేశ్వరరావు, మైస రమేష్, షైక్ మదర్, అపర్ణ వెంకట్, సాదిక్, టిఆర్ఎస్ నాయకులు కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి, సంపేట ఉపేందర్, తాజ్, రంగారావు, బత్తుల ఉపేందర్,డాక్టర్లు, వైద్య సిబ్బంది,
టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking