నవ లిమిటెడ్ సేవలు మరువలేనివి * డి ఆర్ డి ఓ మధుసూదన రాజు

నవ లిమిటెడ్ సేవలు మరువలేనివి

* డి ఆర్ డి ఓ మధుసూదన రాజు

* శిక్షణ పూర్తి చేసుకున్న వారికి యోగ్యతా పత్రాల ప్రదానం

భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:

స్థానిక నవ లిమిటెడ్ తన సంస్థాగత సంఘ సేవా కార్యక్రమాలలో భాగంగా ఏర్పాటు చేసిన ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వెల్డింగ్ ఎలక్ట్రికల్ ఫిట్టర్ టూవీలర్ ఆర్ అండ్ ఏ.సి కోర్సులలో శిక్షణ పూర్తిచేసుకొన్న అభ్యర్థులకు యోగ్యతా పత్రాల ప్రదాన కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జి.మధుసూధన్ రాజు డిస్ట్రిక్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్(డి.ఆర్.డి.ఒ) ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఫిట్టర్ కోర్సులో శిక్షణ పూర్తిచేసుకొన్న అభ్యర్ధి మితిన్ కుమార్ మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా మార్కింగ్ మేజరింగ్ లేత్మిషన్ ఆర్క్ వెల్డింగ్ గ్యాస్ ప్లాస్మ కట్టింగ్ వంటి విషయాలు తెలుసుకోవడం జరిగిందన్నారు.

ఈ శిక్షణ కేంద్రంలో 6నెలల ఉచిత శిక్షణతో పాటు ఉపకారవేతనం శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశం చూపెట్టరని తెలిపారు.

ముఖ్యఅతిధి జి.మధుసూధన్ రాజు మాట్లాడుతూ నవ లిమిటెడ్ యాజమాన్యం ప్రత్యేకంగా యువత మహిళల కొరకు ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయం అని తెలిపారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారు ఆర్థికంగా ఎదగడానికి ఈ శిక్షణ కార్యక్రమాలు ఎంత గానో ఉపయోగపడుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్యామసుందర్, చీఫ్ అడ్మినిస్ట్రేటర్ (సి.యస్.ఆర్)నవ లిమిటెడ్ మాట్లాడుతూ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ మహిళ సాధికార కేంద్రంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమాలను అందరూ ఉపయోగించుకోవాలని కోరారు.

టైలరింగ్లో శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలకు సబ్సిడిపై కుట్టుమిషన్లను అందజేయటం

జరిగింది. ఈ కార్యక్రమంలో చీఫ్ లైజన్ ఆఫీసర్ వి.ఖాదరేంద్రబాబు, సి.హెచ్. శ్రీనివాసరావు డిప్యూటిమేనేజర్,(మెకానికల్) రాజేంద్ర ప్రసాద్ బిన్ను రామకృష్ణ శ్యామ్ శ్రావణ్ శివప్రసాద్

సోహెల్ శర్మ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking