హాత్ సే హాత్ జోడో అభియాన్

హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రను విజయవంతం చేయండి

మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

మద్దూరు, అక్షిత న్యూస్ :

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేస్తున్న పాదయాత్రను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని ఆనాడు సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే రాష్ట్రాన్ని కెసిఆర్ కెసిఆర్ కుటుంబం రాబందుల్లా దోచుకుంటున్నారు. పరిపాలన చేయమని ప్రజలు అధికారం ఇస్తే, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించడంలో కెసిఆర్ విఫలమయ్యారు. పరిపాలన ఫామ్ హౌస్ నుంచి నడుపుతూ తెలంగాణ చిత్వాన్ని నవ్వులపాలు చేస్తున్నారు. రోజు రోజుకు అనేక సమస్యలతో ప్రజలు సతమతం అవుతుంటే వాటికి పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఉండి బాధ్యతారహిత్యంగ వ్యవహరిస్తున్నారు.
బుధవారం రోజున ఉదయం 7.30 గంటలకు జనగామ జిల్లాలో *హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర* దేవరుప్పుల నుండి జనగామ జిల్లాలోకి ప్రారంభమవుతుంది. కావున కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking