కలెక్టరేట్ లో కంటి వెలుగు శిబిరం

*కలెక్టరేట్ లో కంటి వెలుగు శిబిరం*
నల్గొండ, అక్షిత ప్రతినిధి :

కంటి చూపుతో బాధపడుతున్న వారికి “కంటి వెలుగు” కార్యక్రమం ఒక వరం లాంటిదని 18 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరు కంటి వైద్య పరీక్షలు చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని ధరణి కంట్రోల్ రూం లో కలెక్టరేట్ కాంప్లెక్స్ లోని వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులకు ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 14 నుండి 20 వరకు నిర్వహించే ఈ క్యాంపు లో వివిధ శాఖల వారీగా స్లాట్ లు కేటాయించిన తేదీలలో ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు కంటి పరీక్షలు చేసుకొని క్యాంపు ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు.సెలవు దినాలలో క్యాంపు వుండదని ఆమె తెలిపారు. అవయవాలలో అన్నిటికన్నా ప్రధానమైనది కళ్ళని , ఏ చిన్న సమస్య వచ్చిన, కళ్ళు మసకగా కనిపించిన వెంటనే కంటి వెలుగు శిబిరాలలో వైద్య పరీక్షలు చేయించు కోవలసినదిగా సూచించారు. వైద్య పరీక్షలతో పాటు అవసరమైన వారికి మందుల, ఐ డ్రాప్స్, కంటి అద్దాలు పూర్తి ఉచితంగా ఇస్తారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ఆమె సూచించారు. అదనపు కలెక్టర్(రెవెన్యూ) భాస్కర్ రావు కంటి వెలుగు క్యాంపు ను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి.యం. హెచ్. ఓ వేణుగోపాల్ రెడ్డి,కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మోతిలాల్,తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking