
ఆస్తి పన్ను నూరు శాతం వసూలు చేయాలి
అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
జిల్లాలో గ్రామ పంచాయతీలలో ఆస్తి పన్ను నూరు శాతం వసూలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీ రాజ్ ఈ ఈ లు, ఎం.పి.డి. ఓ.లు,ఎం.పి. ఓ.లు, ఏ.పి. ఓ.ల తో సమావేశం నిర్వహించి వివిధ అభివృద్ధి పనులను సేకరించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ లలో ఆస్తి పన్ను వసూలు, తెలంగాణ క్రీడా ప్రాం గణాలు ఏర్పాటు, సి.సి.రోడ్లు,జి.పి.భవనాలు నిర్మాణం, నర్సరీలు ,పల్లె ప్రకృతి వనం లు,బృహత్ పల్లె ప్రకృతి వనం లు ఏర్పాటు,ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించుట తదితర అంశాల పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పన్ను వసూలు చేసి అందులో 8 శాతం లైబ్రరీ సెస్ కింద చెల్లించాలని అన్నారు.తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటులో వారం వారం ప్రగతి కనిపించాలని,ప్రతి గ్రామంలో,ఆవాసం లో ఏర్పాటుకు స్థలం గుర్తించిన చోట పనులు మొదలు పెట్టాలని, స్థలం గుర్తించని చోట తహశీల్దార్ లతో ఎం.పి.డి. ఓ.లు సమన్వయం చేసుకుని స్థలం గుర్తింపు చేయాలని అన్నారు. గ్రామ పంచాయతీల భవనాలు నిర్మాణం సమీక్షించారు. జిల్లాలో నల్గొండ, మిర్యాలగూడ పంచాయతీ రాజ్ డివిజన్ లలో మొత్తం 218 భవనాలు 43 కోట్ల 60 లక్షల రూ.ల అంచనాతో మంజూరు చేయగా 17 భవనాలు నిర్మాణ పనులు పురోగతిలో నున్నట్లు,నల్గొండ డివిజన్ లో 11 కోట్ల 20 లక్షల వ్యయంతో 56 భవనాలు మంజూరు చేయగా 14 భవనాలు పనులు గ్రౌండింగ్ చేయగా, మిర్యాలగూడ డివిజన్ పరిధిలో 32 కోట్ల 40 లక్షల వ్యయంతో 162 భవనాలు మంజూరు చేయగా మూడు గ్రౌండింగ్ చేసినట్లు అధికారులు వివరించగా పనులు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.సి.సి.రోడ్లు జిల్లాలో 123 కోట్ల 14 లక్షల అంచనా వ్యయంతో 731 జి.పి.లలో 1198 పనులు మంజూరు చేయగా 293 గ్రౌండింగ్ చేసి 48 పూర్తి చేసినట్లు తెలిపారు .ప్రతి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతి రోజు 50 మంది కూలీలకు పనులు కల్పించాలని,ఆర్థిక సంవత్సరం ముగింపు రెండు నెలల్లో ముఖ్యంగా లక్ష్యం పూర్తి చేయాలని ఆమె సూచించారు. మధ్యాహ్నం మన ఊరు మన బడి మన బస్తీ మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులను ఎం.ఈ. ఓ.లు,వివిధ శాఖల ఏ. ఈ.లతో సమీక్షించారు.
ఈ సమావేశం లో జిల్లా విద్యా శాఖ అధికారి బిక్ష పతి, జడ్.పి.సి. ఈ. ఓ ప్రేమ్ ఉన్ కరణ్ రెడ్డి,డి.పి. ఓ విష్ణు వర్ధన్,డి.అర్.డి. ఓ కాళిందిని తదితరులు పాల్గొన్నారు.