
ఆరోగ్య తెలంగాణ లక్ష్యం
భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
ఆరోగ్య తెలంగాణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అసంక్రమిత వ్యాధులు ఉన్నవారికీ అందజేసే ఎన్సిడి మందుల కిట్ బ్యాగులను పిహెచ్సిల వారీగా వారి వారి ఇంటి వద్దకు వెళ్లి అందించాలని శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు వైద్య అధికారులను సూచించారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఎన్సిడి మందుల కిట్ బ్యాగులను ఆవిష్కరించి పంపిణి చేసి అనంతరం మాట్లాడుతూ వైద్యారోగ్య శాఖ ఆరోగ్యం తెలంగాణా సాధనలో మధుమేహ, బిపి తదితర వ్యాధిగ్రస్థుల సర్వేను అధికారులు, సిబ్బంది రోగులను గుర్తించి ఎన్సిడి కిట్లు అందజేయాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ కేసా రవి, ప్రభుత్వ డాక్టర్లు, వైద్య అధికారులు పాల్గొన్నారు.