నేడు వైరాలో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం

నేడు వైరా నియోజకవర్గ స్థాయి

ఆత్మీయ సమ్మేళనం

ఖమ్మం / అక్షిత బ్యూరో :

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ స్థాయి పొంగులేటి శీనన్న అభిమానుల ఆత్మీయ సమ్మేళనం ఈ నెల 15 న బుధవారం వైరా పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయ సమీప మైదానంలో జరగనుంది. ఈ మేరకు పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంచార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.00 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆత్మీయ సమ్మేళనానికి వైరా నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని దయాకర్ రెడ్డి కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking