అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ అధ్యక్షులుగా రాజమౌళిచారి

అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ అధ్యక్షులుగా రాజమౌళి చారి

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ అధ్యక్షులుగా రాజమౌళి చారిని నియమిస్తూ
అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ జాతీయ ప్రెసిడెంట్ అశ్వనీ కుమార్ శర్మ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్ పాత్రికేయులు బి.రాజమౌళిచారిని తెలంగాణ రాష్ట్రానికి కొత్త రథసారథిగా ప్రకటిస్తూ అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ జాతీయ కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. కోల్‌కతా వేదికగా 1968లో ఏర్పాటు చేసిన అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ దేశంలోని అన్ని రాష్ట్రాలలో తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది.
ముఖ్యంగా విశ్వకర్మీయులకు బాసటగా అనేక కార్యక్రమాలను చేపట్టి, చైతన్యపరుస్తుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోనూ కొత్త ప్రెసిడెంట్‌ను నియామకం జరిగింది. విశ్వకర్మ మహాసభ నేషనల్ ప్రెసిడెంట్ అశ్వనీ కుమార్ శర్మ హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రాజమౌళిచారిని తెలంగాణ రాష్ట్రానికి కొత్త ప్రెసిడెంట్‌గా నియమిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించి, నియామక పత్రాన్ని అందజేశారు. జాతీయ స్థాయి మహాసభ నాయకులు సుభాష్ చంద్రబోస్, ముఖ్య సలహాదారు చిన్మయాచారి, మహాసభ జాతీయ పరిశీలకులు రామ్‌రాజ్ విశ్వకర్మ, కృష్ణ ప్రసాద్ విశ్వకర్మల సమక్షంలో జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇక మీదట సీనియర్ పాత్రికేయులు రాజమౌళి చారి నాయకత్వంలో అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ కార్యకలాపాలు సాగుతాయని నేషనల్ ప్రెసిడెంట్ అశ్వనీకుమార్ శర్మ ప్రకటించారు. విశ్వకర్మ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి అందాల్సిన ప్రోత్సాహాలకు సంబంధించిన అంశాలపై రాజమౌళి చారి కృషి చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో విశ్వకర్మలకు సంబంధించి అనేక సంఘాలు పనిచేస్తున్నాయని, వారి ఆశీస్సులు, సహకారం కూడా రాజమౌళి చారికి అందించాలని అశ్వనీకుమార్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

మహాసభ పటిష్టతకు కృషి : రాజమౌళి చారి

అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ పటిష్టతకు విశిష్ఠ కృషి చేస్తానని ఆ సంఘం తెలంగాణ అధ్యక్షులు బి.రాజమౌళిచారి అన్నారు. బుధవారం స్థానికంగా పాత్రికేయులతో ముచ్చటిస్తూ విశ్వ కర్మ కులస్తులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు. తనపై నమ్మకం ఉంచి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షులు అశ్వనీ కుమార్ శర్మతో పాటు జాతీయ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. అందరి సమన్వయoతో జాతీ ప్రయోజనాలు కాపాడేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking