
దోపిడి వర్గాలపై రాజీలేని పోరాట వీరుడు తాండ్ర*
*కామ్రేడ్ తాండ్ర కుమార్ విగ్ర ఆవిష్కరణ, ప్రధమ వర్ధంతి సభలో ఎంసిపిఐయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్దికాయల అశోక్ ఓంకార్
శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి :
మతోన్మాద,పాసిస్ట్,దోపిడి వర్గాలపై రాజీలేని పోరాటం చేసిన వీరుడు కామ్రేడ్ తాండ్ర కుమార్ అని యంసిపిఐ(యు) అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్దికాయల అశోక్ ఓంకార్ కొనియడారు. ఈరోజు యం సి పి ఐ (యు) పొలిటి బ్యూరో సభ్యులు,రాష్ట్ర కార్యవర్గ గా బాధ్యతలు నిర్వహిస్తూ అమరత్వం పొందిన అమరజీవి కామ్రేడ్ తాండ్ర కుమార్ గారి ప్రధమ వర్ధంతి సందర్భంగా మియాపూర్ క్రాస్ రోడ్ వద్ద గల ఆయన స్మరక స్తూపం వద్ద నుండి ముజాఫర్ అహ్మద్ నగర్ వరకు భారీ ప్రదర్శన అనంతరం ముజాఫర్ అహ్మద్ నగర్ లో విగ్రహా ఆవిష్యారణ, ప్రధమ వర్ధంతి సభ జరిగింది. ముందుగా స్మారక స్థూపం వద్ద ఆయన చిత్రపటానికి కామ్రేడ్ పోలిట్ బ్యూరో సభ్యులు మహేందర్ నహే(రాజస్థాన్) పూలమాల వేశారు. ముజాఫర్ అహ్మద్ నగర్ లో ఏర్పాటుచేసిన ఆయన విగ్రహాన్ని పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ అనుభవ్ దాస్ శాస్త్రి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన ప్రథమ వర్ధంతి సభలో ముఖ్య అతిథిగా హాజరైన ఎం సి పి ఐ యు అఖిలభారత ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్ గారు మాట్లాడుతూ దోపిడి వర్గాలపై రాజీలేని పోరాటం చేసిన వీరుడు తాండ్ర కుమార్ అని కొనియాడారు. పాలకవర్గాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలలో భాగంగా దేశంలో రాష్ట్రంలో దారిద్రం నిరుద్యోగం హత్యలు పెరుగుతున్న సమయంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ నగరానికి వలస వచ్చిన బడుగు బలహీన బహుజన ప్రజానీకాన్ని సమీకరించి భూ కబ్జాదారుల ఆక్రమాదినంలో ఉన్న ప్రభుత్వ భూములను లాగి పేద ప్రజలకు పంచిన ఘనత తాండ్ర కుమార్ గారిని ఆయన గుర్తు చేశారు. తాండ్ర కుమార్ గారు శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గ ప్రాంతంలో అనేక బస్తీలను ఏర్పాటు చేసి వాటి అభివృద్ధి కోసం ప్రజా పోరాటాలు చేశారని అన్నారు. ఈ తరుణంలో పాలకవర్గాలు అధికార యంత్రాంగం భూకబ్జాదారులు ఆయనపై కక్షగట్టి అనేక కేసులు పెట్టి జైలుకు పంపినారు. బెదరక ప్రజల్ని ఏకం చేసి అందరికీ భూమి కావాలని భూమే ప్రధాన ఆధారమని నిలువనీడని ప్రజల కల్పించాలని పార్టీ నిర్ణయాన్ని ఆయన పొమ్ము చేయకుండా దోపిడి వర్గాలకు దీటుగా నిలబడి రాజీలేని పోరాటాన్ని నిర్వహించారని అన్నారు. దేశంలో రాష్ట్రంలో మతోన్మాద అవకాశవాద రాజకీయాలు పెట్రేగుతున్నాయని పెట్టుబడిదారి కార్పొరేట్ల చేతులలో ప్రభుత్వాల చేతులలో ఉన్నాయని వాటి నుంచి స్వచ్ఛమైన రాజకీయ పరిపాలన కోసం నేటి తరం మరియు ప్రజలు పోరాడవలసిన అవసరాలు ఉన్నాయని, నూటికి 93 శాతం ఉన్న బహుజన ప్రజానీకం రాజ్యాధికారం చేపట్టకుండా భారతదేశ వర్ధమాన రాజకీయ పరిస్థితి మెరుగు పడదని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తమ బడ్జెట్లలో ప్రజలను మోసం చేసే అంశాలను ప్రస్తావిస్తూ ప్రవేశపెట్టారని ఇలాంటి ప్రజలు ఆశ పెట్టే బడ్జెట్ లు గత ప్రభుత్వాలు కూడా ఎన్నో చేసినప్పటికీ వారి అంతిమ లక్ష్యం ప్రజలను అభివృద్ధి పరచడం కాదని కార్పొరేట్ పెట్టుబడిదారుల శక్తుల అభివృద్ధి నేటి పాలకుల అభివృద్ధి అని వాటిని బూచి చూపే రాష్ట్రాన్ని దేశాన్ని మేము అభివృద్ధి పరుస్తామని పోటీపడుతూ ప్రజలు మోసగిస్తున్నారని అన్నారు. ఇలాంటి పాలకవర్గాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండ కట్టడంలో, బహుజనులకు సామాజిక న్యాయ సాధన జరగాలని తపించి పోరాడిన చరిత్ర కామ్రేడ్ తాండ్ర కుమార్ ని ఆయన పోరాట స్ఫూర్తిని సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలందరము పాలక దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు నిర్వహించాలని, ఆ ప్రజా ఉద్యమాల బలోపితమే కామ్రేడ్ తాండ్ర కుమార్ కి అర్పించే నిజమైన నివాళి అని ముగించారు. ఎం సి పి ఐ యు రాష్ట్ర కమిటీ సభ్యులు మైదం శెట్టి రమేష్ అధ్యక్షులు జరిగిన ఈ సభలో పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్స్ అనుభవ దాస్ శాస్త్రి, మహేందర్ నేహ, వల్లెపు ఉపేందర్ రెడ్డి, జయంతో బాయ గుప్తా, రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, బిఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్య ప్రకాష్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల మల్లేష్, బి ఎల్ పి రాష్ట్ర వర్కింగ్ సెక్రెటరీ దండి వెంకట్, పి ఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జేవి చలపతిరావు, సిపిఐ ఎంఎల్ ప్రజాపంద రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, ఎస్ యు సి ఐ సి రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ మురహరి, బీసీపీ రాష్ట్ర కార్యదర్శి కే పర్వతాలు, ఏఐసిటియు కేంద్ర నాయకులు శర్మ,రాజ్యన్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కుంభం సుకన్య వనం సుధాకర్ వరిప్పల వెంకన్న, వసు కుల మట్టయ్య గోనే కుమారస్వామి, తుకారాం నాయక్ ఏ హంసారెడ్డి, పెద్దారపు రమేష్, వెంకన్న వెంకన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు గాదె మల్లేష్ ఎస్ కే మాసం తాండ్ర కళావతి టి అనిల్ కుమార్ పి భాగ్యమ్మ ఏ పుష్ప పల్లె మురళి ఈ కిష్టయ్య గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యులు లాసాని రాజు ఈ దశరత్ నాయక్ కర్ర దానయ్య గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యులు రాంబాబు విమల కన్నశ్రీనివాస్ రంగస్వామి ఎన్ గణేష్ దేవనూరిలక్ష్మి యాదగిరి,ఎం వై కుమార్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొని ప్రసంగించి తాండ్ర కుమార్ కి నివాళులర్పించారు.