
ఘనంగా శివ స్వాముల
ఇరుముడి మహోత్సవం
ఇరుముడితో శ్రీశైలం బయలుదేరిన శివ
స్వాములు
సూర్యాపేట టౌన్, అక్షిత న్యూస్ :
సూర్యాపేట జిల్లాలో ఆత్మ కూర్ (s) మండలం తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో ఘనంగా ఇరుముడి మహోత్సవ కార్యక్రమం జరిగినది. గ్రామం లోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో గురువారం గురుస్వామి ఉప్పుల అంజయ్య నాయిని శ్రీశైలం (శివ స్వామి) ఆధ్వర్యంలో స్వాములకు ఇరుముడులు కట్టారు ఈ సందర్భంగా శివ స్వాములు ఉప్పుల అంజయ్య స్వామి మాట్లాడుతూ మాఘ మాసంలో మాలలు వేసుకొని సన్నిటి స్నానాలతో ఏకభుక్తం భుజిస్తూ నేలపై పండుకొని 41 రోజులు నిష్ఠతో దీక్ష చేయించిన గురు స్వాములకు ముఖ్యంగా మాకు దేవాలయంలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన నిత్య పూజారులకు పాదాభివందనాలు చేసుకొని శ్రీశైల భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి సన్నిధికి వెళ్లి ఇరుముడి అప్పచెప్పుటకు బయలుదేరుతున్నామని ఆ శివపార్వతులు నిత్య పూజారి మరియు మాతో నిష్టగా పూజలు చేయించిన గురుస్వాములను మమ్ముల, మా కుటుంబాలనే కాకుండా తుమ్మల పెన్ పహాడ్ గ్రామ ప్రజలను అష్ట స్వరాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ శ్రీశైలం బయలుదేరుతున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో కన్య స్వాములు, బంధు మిత్రులు గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో ఇరుముడి కార్యక్రమాన్ని తిలకించిన ఆనందించిన అనంతరం తీర్థ ప్రసాదాలు తీసుకోనీ స్వాములను శ్రీశైలం పంపించడం జరిగినది.